భార్యాభర్తల మధ్య కలహం - ఇంటి ఓనర్ మరణం... 

భార్యాభర్తల మధ్య కలహం - ఇంటి ఓనర్ మరణం... 

భార్యాభర్తల మధ్య అనుబంధం బలంగా ఉంటేనే వారి జీవితం హ్యాపీగా సాగుతుంది.  కలకాలం నిలబడుతుంది.  అలా కాకుండా ఇద్దరి మధ్య కలహాలు ఉంటె, చీటికీ మాటికీ కొట్టుకునే వరకు దారీతీస్తే... ఇక ఆ బంధం ఎంతో కాలం నిలబడదు. నిత్యం తిట్టుకుంటూ కొట్టుకుంటూనే ఉంటారు.  దాని వలన ఆ పట్టిన ఉండే వ్యక్తులు ఇబ్బందులు పడుతుంటారు.   ఏదో ఒకసమయంలో వారి బంధం తెగిపోతుంది. ఇలాంటి సంఘటన ఒకటి ఇటీవలే నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో జరిగింది. 

ఆర్మూరులో రాజేందర్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఓ భార్యాభర్తలు దిగారు.  అయితే, వాళ్ళిద్దరి మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. సాయంత్రం అయితే చాలు... గొడవలు తారాస్థాయికి చేరుకుంటాయి. పక్కింట్లో ఉండేవాళ్ళకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది.  టీవీలో వచ్చే మాటలు కూడా వినిపించేవి కాదట. వారి మాటలు భరించలేక ఓనర్ రాజేందర్ టీవీ సౌండ్ మరింతగా పెంచేశాడు.  వారి గొడవకంటే టీవీ సౌండ్ అధికం కావడంతో, భార్యాభర్తలు ఓనర్ దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకున్నాడు. గొడవ విషయంలో ఓనర్ కూడా తగ్గలేదు.  దీంతో అద్దెకు ఉండే వ్యక్తి కోపంతో ఇనుపరాడ్ తో రాజేందర్ తలపై కొట్టాడు.  దీంతో అయన కిందపడిపోయాడు.  హుటాహుటిన హాస్పిటల్ తీసుకెళ్లగా, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.  దీంతో అద్దెకు ఉండే వ్యక్తి అక్కడి నుంచి చల్లగా తప్పించుకున్నాడు.