ప్రియుడిపై మోజుతో భర్త హత్య...

ప్రియుడిపై మోజుతో భర్త హత్య...

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది... రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య... శివరాంపల్లికి చెందిన భర్త ఆనంద్‌ను చంపేసి... ప్రియుడు సంజయ్‌తో కలిసి తగలబెట్టింది. అనంతరం మూసీనదిలో పడేసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది. కిల్లర్ భార్యను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటన జరిగిన 71 రోజుల తర్వాత వెలుగుచూసింది.  2010లో మహేశ్వరీ-ఆనంద్‌ వివాహం జరగగా... ప్రియుడి మోజులో పడింది... దీంతో పక్కా ప్లాన్ వేసి ప్రియుడితో కలిసి భర్త ఆనంద్ ను హత్య చేసింది. అనంతరం శివరాంపల్లి సమీపంలోని గంధంగూడ నిర్మానుష్య ప్రాంతంలో ఆనంద్ బాడీనీ తగలబెట్టారు సంజయ్, మహేశ్వరీ... మే 20వ తేదీన  తగలబెట్టిన ప్రాంతంలో ఆనంద్ ఎముకలను సేకరించి పక్కనే ఉన్న మూసీ నదిలో కలిపేసింది మహేశ్వరి... అదే రోజు తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు 70 రోజుల తర్వాత కేసును ఛేదించారు. మహేశ్వరీతో పాటు సంజయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. గంధంగూడలోని ఘటనా స్థలం నుండి కొన్ని ఎముకలు స్వాధీనం చేసుకొని ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు పోలీసులు.