కరోనా లేకున్నా ట్రంప్ వాటిని ఎందుకు వాడుతున్నాడు...!!?

కరోనా లేకున్నా ట్రంప్ వాటిని ఎందుకు వాడుతున్నాడు...!!?

ట్రంప్ కరోనా విషయాన్నీ లైట్ గా తీసుకున్నాడా అంటే ఇప్పటికే అందరికి సందేహమే.  ఎందుకంటే అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తుంటే, దానిని కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాల్సింది పోయి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పదం అవుతున్నాడు. అమెరికా అధ్యక్ష భవనాన్ని సైతం కరోనా తాకడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది.  

ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్ కరోనా టెస్టులు చేయించుకున్నారు.  నెగెటివ్ వచ్చినప్పటికీ కూడా హైడ్రాక్సీ క్లోరోక్వినోన్ మందులు వాడుతున్నాడట.  కరోనా లేకుండా ఎందుకు అయన ఈ మెడిసిన్ వాడుతున్నట్టో తెలియడం లేదు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ మెడిసిన్ ను ట్రంప్ వాడుతున్నారట.  గత 10 రోజులుగా మెడిసిన్ వాడుతున్నారని అమెరికా అధ్యక్ష భవనం తెలిపింది.  అమెరికాలో ప్రస్తుతం 15 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  90వేలమందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే.