బీజేపీ కురువృద్దులకు అందని అయోధ్య ఆహ్వానం... కారణం...!!

బీజేపీ కురువృద్దులకు అందని అయోధ్య ఆహ్వానం... కారణం...!!

ఈనెల 5 వ తేదీన అయోధ్య రామ్ మందిర్ నిర్మాణానికి భూమి పూజను నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే.  భూమి పూజ కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.  ప్రధానితో సహా మొత్తం 200 మంది అతిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.  అయితే, భూమి పూజకు బీజేపీ కురువృద్దులైన లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు ఆహ్వానాలు ఇంకా అందకపోవడం విశేషం.  

అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో వీరిని ఇటీవలే సీబీఐ కోర్టు ప్రశ్నించింది.  అద్వానీని నాలుగు గంటలపాటు కోర్టు ప్రశ్నించడం విశేషం. అటు మురళీ మనోహర్ జోషిని కూడా సీబీఐ న్యాయస్థానం ప్రశ్నించింది.  వీరు ఇచ్చిన ఉద్రేకపూరితమైన స్పీచ్ ల వలన కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చివేశారు అన్నది ప్రధాన ఆరోపణ.  ఈ ఆరోపణలపై అద్వానీని సీబీఐ కోర్టు ప్రశ్నించినట్టు అద్వానీ తరపు లాయర్ మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే.  అయోధ్య భూమి పూజకు అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు ఆహ్వానం పంపుతామని అయోధ్య తీర్దక్షేత్ర ట్రస్ట్ చెప్పిన సంగతి తెలిసిందే.  అయితే, ఇంకా ఈ కురువృద్దులకు ఆహ్వానం అందకపోవడంతో అనేక అనుమానాలకు తావునిస్తోంది.