యూరప్ లో సక్సెస్ కానీ, ఇండియాలో ఆ విధానం ఎందుకు ఫెయిల్ అవుతోంది...?

యూరప్ లో సక్సెస్ కానీ, ఇండియాలో ఆ విధానం ఎందుకు ఫెయిల్ అవుతోంది...?

యూరప్ దేశంలో కరోనాను కంట్రోల్ చేయడానికి హోమ్ ఐసోలేషన్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది.  అక్కడ ఆ విధానం సక్సెస్ అయ్యింది.  దీనికి ఓ ప్రధాన కారణం ఉన్నది.  హోమ్ ఐసోలేషన్ అంటే, కరోనా సోకిన వ్యక్తిని ఇంట్లోనే ప్రత్యేకమైన గదిలో ఉంచడం, మిగతా వారితో సంబంధం లేకుండా ఓ గదిలో ఉంటూ ఆ గదిలోనే అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటారు.  ఎందుకంటే అక్కడ ప్రతి ఇంట్లో ఈ వెసులుబాటు ఉంటుంది.  ఇంటి నిర్మాణం సమయంలోనే పిల్లలకు, పెద్దలకు వేరువేరుగా గదులు నిర్మిస్తారు.  అమెరికాలో కూడా హోమ్ ఐసోలేషన్ విధానం సక్సెస్ కాలేదు.  

ఇప్పుడు ఇండియాలో హోమ్ ఐసోలేషన్ విధానం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.  హోమ్ ఐసోలేషన్ లో ఉన్న తరువాత కేసులు ఎక్కువౌతున్నాయి.  దీనికి కారణం ఏంటి.  మనదేశంలో ఒక ఇంట్లో అందరికి సపరేట్ గదులు ఉన్న ఇల్లు. నగరాల్లో, పట్టణాల్లో ఒకే గదిలో జీవనం సాగించే వ్యక్తులు కోట్లాదిమంది ఉన్నారు.  ఒకే గదిలో ఉన్నప్పుడు హోమ్ ఐసోలేషన్ ఎలా కుదురుతుంది.  అందుకే ఒకరిని నుంచి ఇద్దరికీ అక్కడి నుంచి మరికొంతమందికి వైరస్ వ్యాపిస్తూనే ఉన్నది.