మత్తు పెంచేందుకా... భారాన్ని తగ్గించేందుకా...? 

మత్తు పెంచేందుకా... భారాన్ని తగ్గించేందుకా...? 

ప్రపంచంలో అత్యధికంగా మద్యం అమ్ముడయ్యే దేశాల్లో ఇండియా ఒకటి.  ఇండియాలో మద్యం అత్యధికంగా అమ్ముడవుతుంది.  ఎక్సయిజ్ డ్యూటీ నుంచి సంవత్సరానికి రూ.2.48 లక్షల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుంది.  కరోనా కారణంగా గత 41 రోజుల నుంచి లాక్ డౌన్ విధించారు.  ఈ లాక్ డౌన్ వలన దేశంలో మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి.  మద్యం దుకాణాలు బంద్ కావడంతో దేశానికి ఆదాయం ఆగిపోయింది.  

41 రోజుల తరువాత మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి.  లాక్ డౌన్ సమయంలోనే చాలామంది మందుబాబులు బ్లాక్ లో వేల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు.  మద్యం ధరలు ప్రభుత్వం పెంచినప్పటికీ సేల్స్ తగ్గుతుంది అనుకుంటే పొరపాటే.  ప్రభుత్వానికి ఆదాయం కావాలనే మిగతా పరిశ్రమలు ఓపెన్ చేసి దాని నుంచి ఆదాయం  రాబట్టుకుంటే బాగుంటుంది. ఒక్కసారి మద్యం దుకాణాలు ఓపెన్ చేస్తే  జనాలను కంట్రోల్ చేయడం చాలా కష్టం.  ఈ సంగతి ప్రభుత్వానికి కూడా తెలుసు. 

తెలిసినప్పటికీ కూడా దుకాణాలు ఓపెన్ చేయడం వెనుక ఆంతర్యం ఏంటి అన్నది తెలియాల్సి ఉన్నది.  లాక్ డౌన్ సమయంలో గృహహింసలు పెరిగిపోతున్నాయని ప్రభుత్వమే చెప్తున్నది.  దీనికి మద్యం ఆజ్యం పోసినట్టవుతుంది.  పైగా మద్యం కొనుగోలు చేయడానికి వచ్చే వ్యక్తులు సామాజిక దూరం పాటించడం లేదు.  లాకా డౌన్ నిబంధనలు పక్కాగా అమలు జరగడం లేదు.  మద్యం కొనుగోలు చేయడానికి వచ్చే వాళ్ళల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటె పరిష్టితి ఏంటి.  నరసరావుపేటలో టీ తాగడానికి వచ్చిన వ్యక్తి నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. మద్యం దుకాణాల వద్ద జరగదని గ్యారెంటీ లేదు.  40 రోజులపాటు లాక్ డౌన్ లో పడిన కష్టం నిన్న ఒక్కరోజుతో గంగపాలైందని నిపుణులు ఆవేదన చెందుతున్నారు.