కరోనా కొందరిని కాటేస్తోంది, కొందరికి లక్షణాలు కూడా లేవు : ఎందుకంటే !

కరోనా కొందరిని కాటేస్తోంది, కొందరికి లక్షణాలు కూడా లేవు :  ఎందుకంటే !

కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. అయితే ఈ వైరస్ బారిన పడిన వారు కొందరు ప్రాణాలు కోల్పోతోంటే మరి కొందరు అసలు లక్షణాలు కూడా కనపడకుండానే వైరస్ బారి నుండి బయట పడుతున్నారు. కొందరు వెంటిలేషన్ మీద పెట్టినా బతికి బట్టలేకపోతుంటే కొందరేమో అసలు పెద్దగా ఎటువంటి మెడికేషన్ లేకుండానే బయట పడుతున్నారు. ముందు వయస్సు అనేదే కారణం అని భావించినా కొందరు యువత కూడా దీని వలన మృత్యు వాత పడడం వారిని ఆలోచనలో పడేసింది. అందుకే అమెరికాలోని 1.3 మిలియన్ కరోనా కేసులను స్టడీ చేయగా తేలింది ఏంటంటే గుండె పోటు, డయాబెటిస్ ఉన్న వారు, పొగ తాగేవారు, భారీ కాయులు ఆసుపత్రిలో చేరే అవకాశం మామూలు వారి కంటే ఆరు రెట్లు అధికంగా ఉన్నాయని అలాగే, మామూలు వారితో పోలిస్తే వీరి మరణాలు కూడా 12 రెట్లు అధికంగా ఉన్నాయని తేలింది.  

వయసు
డయాబెటిస్ (టైప్ 1 మరియు టైప్ 2)
గుండె జబ్బులు మరియు రక్తపోటు
ధూమపానం
బ్లడ్ గ్రూప్ 
జన్యుపరమైన కారణాలు


వయసు :

కరోనా విషయంలో ఇది మెయిన్ ఫాక్టర్, అమెరికాలో చనిపోయిన పదిమందిలో ఎనిమిది మంది 65 ఏళ్ళు పైబడ్డ వారే. ఆ వయసు వచ్చాక అందరికీ గుండె జబ్బులు, డయాబెటిస్ లాంటివి ఎక్కువగా ఉంటున్నాయి. అ వయసు వచ్చే సరికి ఇమ్మ్యూనిటీ కూడా చాలా తక్కువగా ఉంటోంది. 

డయాబెటిస్ (టైప్ 1 మరియు టైప్ 2) : 

ఈ స్టడీలో కరోనా మామూలు వారి కంటే డయాబెటిస్ ఉన్న వారిని 3.7 రెట్లు సోకడానికి కానీ, సోకాక మరణించడానికి అవకాశం ఉన్నట్టు తేలింది.  

గుండె జబ్బులు మరియు రక్తపోటు :

ఈ స్టడీలో కరోనా మామూలు వారి కంటే గుండె జబ్బులు మరియు రక్తపోటు ఉన్నవారికి ఎక్కువగా సోకడానికి కానీ,  సోకాక మరణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు తేలింది. 

ధూమపానం : 

ఈ స్టడీలో కరోనా మామూలు వారి కంటే ధూమపానం చేసే వారికి ఎక్కువగా సోకడానికి కానీ,  సోకాక మరణించడానికి అవకాశాలు ఉన్నట్టు తేలింది. 

బ్లడ్ గ్రూప్ :

ఈ స్టడీలో మిగతా బ్లడ్ గ్రూప్స్ వారితో పోలిస్తే ఏ గ్రూప్ (A-positive, A-negative and AB-positive, AB-negative) వారు ఎక్కువగా కరోనా బారిన పడే అవకాశం ఉంది, వారి ప్రాణాలకి కూడా మిగతా వారితో పోలిస్తే ప్రమాదం ఎక్కువ. ఇక మిగతా బ్లడ్ గ్రూప్స్ వారితో పోలిస్తే ఓ గ్రూప్ (O-negative and O-positive) వారికి సోకే అవకాశం కొంచెం తక్కువ. 
 
జన్యుపరమైన కారణాలు : 
ఈ స్టడీలో కరోనా సోకినా కొందరికి లక్షణాలు కనిపించాకపోడానికి, కొందరు త్వరగా మరణించడానికి కారణం జన్యుపరమైనదిగా కూడా ఉండచ్చని తేలింది.