ఈ రోజు ముంబై బోణి కొడుతుందా..?

ఈ రోజు ముంబై బోణి కొడుతుందా..?

ఐపీఎల్ 2020 లో ఈ రోజు మ్యాచ్ కోల్‌కత నైట్ రైడర్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతుంది. అయితే కోల్‌కత జట్టుకు ఈ ఏడాది ఐపీఎల్ లో ఇదే మొదటి మ్యాచ్ కాగా ముంబై కు మాత్రం రెండో మ్యాచ్. మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడిన ముంబై 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. కానీ ఆ తర్వాత చెన్నై బ్యాట్స్మెన్స్ ను నిలువరించలేక 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక ఐపీఎల్ లోనే అత్యుత్తమ ఆల్ రౌండర్లను కలిగి ఉన్న ముంబై, కోల్‌కత రెండు జట్లు ఈ రోజు ఎదురుపడుతున్నాయి. మరి ఇందులో ఏ జట్టు విజయం సాధిస్తుంది. ఎవరు ఈ ఐపీఎల్ 2020 బోణి చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రెండు జట్లలో ఉన్న బలాలు, బలహీనతలు ఏంటి అనేది తెలియాలంటే ఈ కింది వీడియోను క్లిక్ చేయండి.