డబ్ల్యూహెచ్‌వో కీలక ప్రకటన..

డబ్ల్యూహెచ్‌వో కీలక ప్రకటన..

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌కు చెక్‌ పెట్టేందుకు రకరకాల ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి... ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్లు మార్కెట్‌లోకి రాగా... మరికొన్ని కీలక దశకు చేరుకున్నాయి.. అయితే.. కోవిడ్‌ వ్యాక్సిన్ల వాడకం వల్ల ప్రజల ఆరోగ్యంపై ఏవైనా దుష్ప్రభావాలు పడితే.. వారికి తగిన వైద్య సహాయం అందేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ  ఓ  బీమా పథకాన్ని ప్రకటించింది. ఇందుకుగాను 'కోవాక్స్'‌ ప్రమోటర్లు, డబ్ల్యూహెచ్‌వో, 'గావి' సంయుక్తంగా ఓ సహాయక నిధిని ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలకు సమానంగా అందించడమే లక్ష్యంగా కోవాక్స్‌ కూటమి ఏర్పాటైంది. వ్యాక్సిన్‌ వాడకంపై భయాలు, సందేహాలను తొలగించేందుకే బీమా పథకాన్ని చేపట్టినట్టు కోవాక్స్‌ వివరించింది.