వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంచలన నిర్ణయం: 92 దేశాలకు భద్రత... 

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంచలన నిర్ణయం: 92 దేశాలకు భద్రత... 

ప్రపంచంలో కరోనా వైరస్ ను అడ్డుకోవడానికి అనేక దేశాలు వ్యాక్సిన్ ను సిద్ధం చేస్తున్నాయి.  ప్రస్తుతం మార్కెట్ లోకి ఏ ఒక్క వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాలేదు.  ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరి వరకు అందుబాటులోకి వస్తుంది.  అయితే, ప్రపంచంలోని అన్ని దేశాలకు సమానంగా వ్యాక్సిన్ ను పంపిణి చేసేందుకు వ్యాక్సిన్ తయారీ సంస్థలు కలిసి కోవాక్స్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కరోనాపై అపోహలను, భయాలను పోగొట్టేందుకు కొవాక్స్ భీమా సౌకర్యాన్ని తీసుకొచ్చింది.  దీనిని ప్రపంచ ఆరోగ్యసంస్థ, గావి లు పర్యవేక్షిస్తుంటాయి.  అయితే, ఈ భీమా సౌకర్యం ప్రపంచంలోని 92 అల్పాదాయ దేశాలకు మాత్రమే వర్తింపజేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది.  ఒకవేళ కరోనా వ్యాక్సిన్ వలన అనుకోని విధంగా ఏవైనా ఇబ్బందులు కలిగితే, ప్రభుత్వంపై భారం పడకుండా ఉండేందుకు ఈ భీమా ఉపయోగపడుతుంది.  ఈ భీమా 2022 జులై వరకు వర్తిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.  కేవలం అల్పాదాయ దేశాలకు మాత్రమే ఈ భీమా సౌకర్యం వర్తిస్తుంది.  ఏ ప్రకారంగా అల్పాదాయ దేశాలను ఎంపిక చేశారన్నది తెలియాల్సి ఉన్నది.