అల బాగున్నా... సరిలేరుకే కిరీటం ఎందుకిచ్చినట్టు...
అల వైకుంఠపురంలో సినిమా అందరూ బాగుందని అంటున్నారు. థియేటర్లకు జనాలు వెళ్తున్నారు. మంచి వసూళ్లు రాబడుతున్నది. ఇంతవరకు బాగానే ఉన్నది. అయితే, ఈ సంక్రాంతి బాక్సాఫీస్ కలెక్షన్లు మాత్రం మహేష్ బాబు సరిలేరు వైపే మొగ్గు చూపుతున్నాయి. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతున్నది.
మహేష్ సినిమా కామెడీ పరంగా నవ్విస్తూనే మాస్ యాక్షన్ తో మెప్పించడంతో సినిమా దూసుకుపోతున్నది. అలాగని అల వైకుంఠపురంలో సినిమా తక్కువేమి కాదు. కాకపోతే, ఆ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ సినిమాగా ఉండటంతో ఆ సినిమాకు వచ్చే కలెక్షన్లు దానికి ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి తెలుగు సినిమా ఇండస్ట్రీ పాజిటివ్ గానే స్టార్ట్ చేసింది. జనవరి 9 న వచ్చిన దర్బార్, జనవరి 11 న వచ్చిన సరిలేరు నీకెవ్వరూ, అలానే జనవరి 12 వ వచ్చిన అల వైకుంఠపురంలో సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని హిట్ కొట్టాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)