భారత్ కు ఆ సత్తా ఉంది- ప్రపంచ ఆరోగ్య సంస్థ

భారత్ కు ఆ సత్తా ఉంది- ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనా వైరస్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది.  కరోనా వైరస్ ను అడ్డుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తున్నారు. కానీ, వైరస్ ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే.  ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సరైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.  ఇండియా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.  

దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ చేశాయి. 9  తరువాత ఎవరూ కూడా బయటకు రావడం లేదు. గతంలో ఇండియా పోలియో,  చికెన్ పాక్స్ వంటి మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొంది.  ఇప్పుడు కరోనా వైరస్ ను కూడా ఇండియా సమర్ధవంతంగా ఎదుర్కొనగలిగే సత్తా ఉందని, ఆ నమ్మకం ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఉందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైకేల్ ర్యాన్ పేర్కొన్నారు.  తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ప్రపంచంలో 16,568 మంది మరణించారు.  ఇండియాలో 9 మరణాలు సంభవించాయి.