కరోనా అంతం ఎప్పుడంటే...!!

కరోనా అంతం ఎప్పుడంటే...!!

కరోనా వైరస్ కేసులు ఇండియాలో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.  అయితే, ఎప్పటి వరకు కరోనా పూర్తిగా తగ్గుముఖం పడుతుంది అనే దానిపై ఇప్పటి వరకు ఖచ్చితమైన అంచనా లేదు.  ఎప్పటి వరకు కరోనా అంతం అవుతుందనే దానిపై కేంద్రం ఇటీవలే ఓ కమిటీని నియమించింది.  ఈ కమిటీ నివేదికల ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కరోనా  అంతం కావొచ్చని పేర్కొంది.  కోవిడ్‌-19 నియంత్రణకు జారీ చేసిన మార్గదర్శకాలను విధింగా పాటించాలని కమిటీ స్పష్టం చేసింది.  కరోనా వైరస్‌ కముమరుగయ్యే నాటికి,  దేశవ్యాప్తంగా ఒక కోటి ఐదు లక్షల మంది మహమ్మారి బారినపడతారని కమిటీ అంచనా వేసింది.  ఇక శీతాకాలంలో భారత్ ‌లో రెండోవిడత “కరోనా” వైరస్‌ కేసుల ఉధృతి పెరిగే అవకాశం లేకపోలేదని “నీతి ఆయోగ్‌” సభ్యులు వీకే పాల్‌ హెచ్చరించారు.  వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తే,  దాన్ని పౌరులందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేలా అన్ని వనరులూ సిద్ధంగా ఉన్నాయని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.