వాట్సప్ కొత్త మార్పులు.. ఇక, మీపై నిఘా..!

వాట్సప్ కొత్త మార్పులు.. ఇక, మీపై నిఘా..!

వాట్సప్ ప్రైవసీ పాలసీలో కొత్త మార్పులు వచ్చాయి. వాట్సప్ కొత్త రూల్స్ యాక్సెప్ట్ ఖాతాదారుల వివరాలన్నీ వాట్సప్‌కి తెలుస్తాయి. అంతేకాదు...  వాట్సప్‌లో పంపే మెసేజెస్ పైనా వాట్సప్ నిఘా ఉంటుంది. కొత్త ప్రైవసీ పాలసీ ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి రానుంది. అంతలోపు వాట్సప్ కొత్త ప్రైవసీ రూల్స్ అంగీకరించాలి. ఈ రూల్స్ అంగీకరించకపోతే వాట్సప్ యాప్ ఉపయోగించడం సాధ్యం కాదు. వాట్సప్ తెచ్చిన కొత్త రూల్స్‌ను ఓ సారి పరిశీలిస్తే.. ప్రతీ యూజర్‌ పంపే మెసేజెస్ పైనా వాట్సప్ నిఘా ఉంటుంది. మన అభిరుచులు, ఆసక్తులు.. ఎక్కువగా వేటి గురించి మాట్లాడతాం అన్న విషయాలు వాట్సప్‌కు తెలిసిపోతాయి.. ఇలా తెలుసుకున్న సమాచారాన్ని వాట్సాప్.. ఫేస్‌బుక్‌తో పంచుకోనుంది. ఒకప్పుడు వాట్సప్ ఇండిపెండెంట్ సంస్థ. కానీ, ఇప్పుడు ఫేస్‌బుక్‌కు చెందిన సంస్థ. అభిరుచులు, ఆసక్తులు ఫేస్‌బుక్‌కి తెలియడం వల్ల మనం ఏవి ఇష్టపడతారో అందుకు సంబంధించిన యాడ్స్ మీ స్క్రీన్‌పైన ఎక్కువగా కనిపించబోతున్నాయి.. దీని ద్వారా మీకు ఆ అడ్వర్‌టైజ్‌మెంట్ల ట్రాప్‌లో పడే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. 

వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీ ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి రానుంది. అంటే అంతలోపు వాట్సప్ కొత్త ప్రైవసీ రూల్స్ అంగీకరించాలి. ఈ రూల్స్ అంగీకరించకపోతే మీరు వాట్సప్ యాప్ ఉపయోగించడం సాధ్యం కాదు. మరోవైపు.. ఇప్పటి వరకు వాట్సప్ అంటే ప్రైవసీకి మొదటి ప్రాధాన్యతగా చెప్పుకునేవారు.. వాట్సప్‌లో ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉండటం మరో కారణం... అంటే.. మనం పంపిన మెసేజ్ ఎవరికైతే పంపామో.. వారికి మాత్రమే కనిపిస్తుంది. ఎవరూ హ్యాక్ చేసి ఆ మెసేజ్‌ని చదవడం సాధ్యం కాదన్నమాట.. కానీ, ఇప్పుడు వాట్సప్ ప్రైవసీ పాలసీలో కొత్త మార్పులు వచ్చాయి. మనం వాట్సప్ కొత్త రూల్స్ యాక్సెప్ట్ చేసినట్టైతే మనం ఉపయోగించే ఫోన్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాటరీ లెవెల్, సిగ్నల్ స్ట్రెంత్, యాప్ వర్షన్, బ్రౌజర్ ఇన్ఫర్మేషన్, మొబైల్ నెట్వర్క్, కనెక్షన్ ఇన్ఫర్మేషన్, భాష, టైమ్ జోన్, ఐపీ అడ్రస్ లాంటి వివరాలన్నీ వాట్సప్‌కి తెలిసిపోతాయన్నమాట.. కాగా, ఇప్పటికే వాట్సప్ ఓపెన్ చేయగానే కొత్త ప్రైవసీ రూల్స్ పాప్ అప్ మెసేజ్ ప్రతి వినియోగదారుడి ఫోన్‌లోనూ కనిపిస్తున్నాయి.. అవి యాక్సెప్ట్ చేస్తే మీరు వ్యవహారాలన్నీ వారికి తెలిసిపోనున్నాయి. మరోవైపు.. ఈ గొడవంతా ఎందుకు.. అసలు యాప్‌కే బైబై చెబితే పోలా అనేవారు కూడా లేకపోలేదట.