వాట్సాప్‌పై ఎన్నో అనుమానాలు..! అన్నింటిపై క్లారిటీ ఇచ్చేసింది..
వాట్సాప్‌పై ఎన్నో అనుమానాలు.. మరెన్నో పుకార్లు హల్చల్ చేస్తున్నాయి... ఈ సోషల్ మీడియా యాప్‌పై సోషల్ మీడియాలోనే దుమ్మెత్తిపోస్తున్నారు నెటిజన్లు.. కొత్త ప్రైవసీ పాలసీ వచ్చిన తర్వాత.. వినియోగదారుడి ప్రైవైసీపై అనేక అనుమానాలు పుట్టుకుస్తున్నాయి... వాట్సాప్‌లో గుట్టుగా చేసే చాట్ మొత్తం ఫేస్బుక్లో ప్రత్యక్షం అవుతుందనే పుకార్లు కూడా షికార్లు చేశాయి.. దీంతో.. కొత్త పాలసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యూజర్లు.. ఇదే సమయంలో.. ఇక మావళ్లు కాదు బాబోయ్ అంటూ వాట్సాప్‌కు బైబై చెప్పేసి.. సిగ్నల్, టెలిగ్రామ్‌లాంటి, వైబర్.. ఇలా ప్రత్యామ్నాయ యాప్‌ల వైపు వెళ్లిపోతున్నారు.. ఈ సెగ వాట్సాప్‌కు తాకింది.. వెంటనే స్పందిచకపోతే.. అసలుకే మోసం వస్తుందని గ్రహించిన వాట్సాప్.. వెంటనే తమ కొత్త పాలసీపై వాట్సాప్ క్లారిటీ ఇచ్చింది. ప్రైవసీ పాలసీలో చేసిన మార్పులు.. యూజర్లు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిన మెసేజ్‌ల ప్రైవసీపై ఎలాంటి ప్రభావం చూపబోవని స్పష్టం చేసింది.. అయితే, వాట్సాప్‌లో బిజినెస్ మెసేజింగ్‌కు సంబంధించినవి మాత్రం ఈ అప్డేట్లో మార్పులు జరగనున్నట్లు చెప్పుకొచ్చింది.. అంతేకాదు.. సమాచారం మొత్తం ఎఫ్బీలో షేర్ చేస్తారన్న దానిపై కూడా క్లారిటీ ఇస్తూ.. ఫేస్‌బుక్‌తో తాము ఏ సమాచారం షేర్ చేయబోమని క్లారిటీ ఇచ్చింది.
ఇక, ఫ్రైవసీ పాలసీపై వాట్సాప్ వివరణను ఓ సారి గమనిస్తే... వాట్సాప్‌గానీ, ఫేస్‌బుక్‌గానీ మీ ప్రైవేట్ మెసేజ్‌లను చూడటం కానీ, మీ కాల్స్ వినడం కానీ చేయవు... ప్రతి ఒక్కరు పంపే మెసేజ్‌లు, చేసే కాల్స్ లాగ్స్‌ను మాత్రం వాట్సాప్ అలాగే ఉంచుతుంది... వాట్సాప్‌గానీ, ఫేస్‌బుక్‌గానీ మీరు షేర్ చేసిన లొకేషన్‌ను చూడవు... వాట్సాప్ మీ కాంటాక్ట్‌లను ఫేస్‌బుక్‌తో షేర్ చేయదు... వాట్సాప్ గ్రూప్స్ కూడా ప్రైవేట్‌గానే ఉంటాయి.. మీ మెసేజ్‌లు అదృశ్యమయ్యేలా సెట్ చేసుకోవచ్చు కూడా.. మీరు మీ డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చు అని స్పష్టత ఇచ్చింది వాట్సాప్. మరి.. దీనిపై యూజర్ల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.. ఇప్పటికే కొంతమంది వాట్సాప్‌కు బైబై చెబుతున్నారనే వార్తల నేపథ్యంలో.. వాట్సాప్ ప్రకటన ఇప్పుడు కీలకంగా మారింది.ఇదే సమయంలో.. కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలు అంగీకరిస్తేనే వాట్సాప్ వినియోగానికి అర్హులు.. లేకపోతే ఖాతా తొలగిస్తామని కూడా స్పష్టం చేసింది.
We want to address some rumors and be 100% clear we continue to protect your private messages with end-to-end encryption. pic.twitter.com/6qDnzQ98MP
— WhatsApp (@WhatsApp) January 12, 2021
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)