వలస జీవుల నావ తీరం చేరేనా...!

వలస జీవుల నావ తీరం చేరేనా...!

కరోనా లాక్ డౌన్ వలస కార్మికుల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. పనులు లేక 40 రోజులు దాటడంతో, ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఇంటి బాట పట్టారు. పొట్ట కూటి కోసం ఊరు కాని ఉరికి వచ్చి.. అష్టకష్టాలు పడుతున్నారు. ఉన్న ఊర్లో  కలో గంజొ తాగి బతుకుదామనుకుంటే సొంతూరికి పొనివ్వడం లేదు. బతుకు భారమైన వలస కూలీలు, కాలినడకన ఇంటిబాట పట్టారు. కార్మికుల కష్టాలకు చలించిన కేంద్రం అనుమతులిచ్చినా, తరలింపు ప్రక్రియ ఇప్పుడు ప్రభుత్వాలకు పెద్ద ప్రహసనంగా మారింది.  

ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఇవ్వక పొయినా సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలనే తపన వారిని ఇంటిబాట పట్టించింది. కాలినడకన వేల కిలో మీటర్లు నడుచుకుంటూ పొతామని మొండికేస్తున్నారు. పిల్లా పాపలతో నెత్తిన మూట పెట్టుకుని,  రోడ్డు పట్టుకుని నడక సాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని జాతీయ రహదారులపై ఎక్కడ చూసినా,  వలస కూలీలు నడుచుకుంటూ పొతున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. తరలింపు ప్రక్రియ జాప్యం అవుతున్నకొద్దీ, ఆందోళన చెందుతున్నారు ఈ వలస జీవులు .మరోవైపు ఇప్పటికే కార్మికుల వివరాలు సేకరిస్తున్న అధికారులు, అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత స్వస్థలాలకు పంపాలని నిర్ణయించారు. అందులో భాగంగా గ్రూపులుగా విడగొట్టి మరీ రైళ్లల్లో పంపేందుకు కసరత్తు చేస్తున్నారు.

గత మూడు రోజుల నుంచి వలస కార్మికులకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.ఇందులో భాగంగా ప్రతి ఒక్క వలస కార్మికులు తప్పనిసరిగా స్దానిక పోలీస్ స్టేషన్ల్ తమ  పేరును రిజిస్టర్ చేయించుకోవాలని... ఇలా నమోదు చేయించుకోవడానికి ఒక యాప్ ను కూడా ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారందరి వివరాలు సేకరిస్తున్నారు. ఆధార్ కార్డు తో పాటుగా స్దానిక అడ్రస్ తో పాటుగా సొంత ఉరిలో వుండే కాంటాక్ట్ నెంబర్లు.. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్లను తీసుకుంటున్నారు.  ఇలా తీసుకున్న వారందరిని 1250మందిని ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి గమ్యస్థానాలకు చేరుస్తున్నారు.

ఓ వైపు ప్రభుత్వాలు నచ్చ చెబుతున్నా వినకుండా కాలి నడకన ఇంటిబాట పడుతున్నారు ఈ వలస జీవులు. తరలింపు ప్రక్రియ ఆలస్యమవుతుందన్న అపనమ్మకంతోనే పిల్లా పాపలను పట్టుకుని రోడ్డు మార్గంలో నడుచుకుంటూ పొతున్నారు. కార్మికుల్లో గందర గోళం నెలకొనకుండా వీరికి నచ్చజెఫ్పి గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత మాత్రం పాలకులదే...