లాక్ డౌన్ తరువాత మోడీ ఏం చేయబోతున్నారు... ప్రణాళికలు ఏంటి? 

లాక్ డౌన్ తరువాత మోడీ ఏం చేయబోతున్నారు... ప్రణాళికలు ఏంటి? 

మార్చి 15 కు ముందు దేశంలో లాక్ డౌన్ విధిస్తారని ఎవరూ ఊహించలేదు.  అయితే, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 22 వ తేదీన ఇండియాలో జనతా కర్ఫ్యూ విధించారు. జనతా కర్ఫ్యూకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఒక్కరోజే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ, తరువాత మార్చి 25 నుంచి దేశం మొత్తం మీద లాక్ డౌన్ విధించారు.  అప్పటి నుంచి ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది.  ఎవరూ కూడా బయటకు రానటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.  

లాక్ డౌన్ కారణంగా ఆర్ధికంగా దేశం నష్టపోతోంది.  కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో లాక్ డౌన్ ను కొనసాగించాల్సి వచ్చింది. ఇప్పటికే లాక్ డౌన్ ను రెండు సార్లు పొడిగించారు. ప్రస్తుతం 3.0 నడుస్తున్నది.  దీంతోపాటుగా కొన్ని సడలింపులు కూడా తీసుకురావడంతో ఇండియాలో కొంతమేర ఆర్ధికంగా డబ్బులు వస్తున్నాయి. పరిశ్రమలు ఓపెన్ చేసిన పర్వాలేదు... మద్యం షాపులు ఓపెన్ చేయాలనీ అనుకోవడం ప్రభుత్వం తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయంగా చెప్పొచ్చు.  

మద్యం షాపులు తెరుచుకుంటే ఫలితం ఇలా ఉంటుందో నిన్నటి రోజున అర్ధం అయ్యింది.  ఇవన్నీ వేరే సంగతి అనుకుంటే, లాక్ డౌన్ పూర్తయ్యాక దేశంలో ఏం జరగబోతుంది... దేశం ఆర్ధికంగా, పారిశ్రామికంగా అభివృద్ధి జరిగేందుకు ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే విషయం గురించే అందరూ చర్చించుకుంటున్నారు.  లాక్ డౌన్ కారణంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు.  వారి కుటుంబాలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది.  వాళ్లకు ఉపాధి కల్పించాలి అంటే పరిశ్రమలు స్థాపించాలి.  చైనాలో ఉండే కంపెనీలు అక్కడి నుంచి తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో దానిని ఇండియా ఉపయోగించుకోబోతున్నది.  చైనా నుంచి ఇండియాకు వచ్చే కంపెనీల కోసం స్థలాన్ని, మౌలిక వసతులను కల్పించేలా ఏర్పాటు చేస్తున్నారు. 

అదేవిధంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఊతం ఇచ్చేలా చర్యలు తీసుకోవబోతున్నారు.  ఇండియాలో తయారీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం కేంద్రం వేగంగా పావులు కడుపుతున్నది.  రాబోయే రోజుల్లో చైనాకు ధీటుగా ఎదిగేందుకు ఇండియా పధకాలు రచిస్తున్నట్టు సమాచారం.