ఇంగ్లండ్ కు షాక్... నాలుగు వికెట్ల తేడాతో విండీస్ విజయం... 

ఇంగ్లండ్ కు షాక్... నాలుగు వికెట్ల తేడాతో విండీస్ విజయం... 

సౌతాంప్టన్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఆతిధ్య జట్టు ఇంగ్లాండ్ కు షాక్ తగిలింది. నిన్న జరిగిన చివరి తోజు ఆటలో నాలుగు వికెట్ల తేడాతో విండీస్ విజయం సాధించింది.  జెర్మైన్ బ్లాక్‌వుడ్ అద్భుతమైన 95 పరుగులు చేసి తన జట్టు విజయం లో కీలక పాత్ర పోషించాడు. నిన్నటి ఆటను 284 పరుగుల వద్ద కేవలం రెండు వికెలు తమ చేతిలో ఉంచుకొని ప్రారంభించిన ఇంగ్లాండ్ 313 పరుగులకు ఆల్ ఔట్ అయ్యి 199 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన విండీస్ జట్టు మొదట్లో వికెట్లు త్వరగా చేజార్చుకున్న ఆ తర్వాత బ్లాక్‌వుడ్ నిలకడాగా రాణించడం 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి విజయం సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రే ఆర్చర్ 3 వికెట్లు, బెన్ స్టోక్స్ 2 వికెట్లు, మార్క్ వుడ్ ఒక వికెట్ తీసుకున్నారు. ఇక ఈ విజయంతో మూడు మ్యాచ్ ల ఈ టెస్ట్ సిరీస్ లో 1-0 ఆధిక్యం లో వెస్టిండీస్ జట్టు నిలిచింది.