అరుదైన రికార్డు సాధించిన కీరన్ పొలార్డ్‌

అరుదైన రికార్డు సాధించిన కీరన్ పొలార్డ్‌

వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ తన బ్యాటుతో విజృంభించారు. శ్రీలంకతో జరుగిన టీ20 మ్యాచ్‌లో సిక్సుల వర్షం కురిపించారు. ఒక ఓవర్‌లో ఆరు సిక్సులు బాది అరుదైన రికార్డును సాధించారు. శ్రీలంక స్పిన్నర్ ధనంజయ ఈ మ్యాచ్‌లో వరుసగా మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ చేశారు. ఆ తరువాత ధనుంజయ బౌలింగ్‌లో పొలార్డ్ ఈ ఘనత సాధించారు. వరుసగా ఆరు సిక్సులు బాది బౌలర్‌కు ఆ ఓవర్‌ను ఓ పీడకలగా మిగిల్చారు. బుధవారం జరుగిన మ్యాచ్‌లో పోలార్డ్ దాటికి విండీస్ 131 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.1 ఓవర్లలో ఛేదించింది. ఈ మ్యాచ్‌తో ఓవర్‌లో ఆరుసిక్సులు బాదిన బ్యాట్స్‌మన్‌ల జాబితాలో పోలార్డ్ కూడా చేరారు. ఇంతకు ముందు ఈ ఘనతను సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మన్ హర్షలీ గిబ్స్, భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తరువాత ఈ ఘనతను సాధించింది పొలార్డ్ మాత్రమే. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్ కేవలం 13.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.