కరోనా తో చనిపోతే ప్రభుత్వ ఉద్యోగం..పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

   కరోనా తో చనిపోతే ప్రభుత్వ ఉద్యోగం..పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి సాధారణ ప్రజలతో పాటు ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు,సెలబ్రెటీల లను సైతం వదిలిపెట్టడంలేదు. అయితే లాక్ డౌన్ తరవాత అన్ని ప్రభుత్వశాఖలు తిరిగి తెరుచుకున్నాయి. కానీ కరోనా ఉదృతి పెరగటంతో ఉద్యోగులు ఉద్యోగాలకు వెళ్ళడానికి జంకుతున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుతం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కరోనాతో మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. బుధవారం అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనా భారిన పడ్డారు. దాంతో ఉద్యోగులు ఆఫీస్ లకు రావటానికి భయపడుతున్నారు. అలాంటివారిలో ధైర్యాన్ని నింపేందుకు మమతా బెనర్జీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటివరకు రాష్ట్రంలో 268 మంది పోలీసులు,30 మంది డాక్టర్లకు 43 మంది వైద్య సిబ్బంది, 62 మంది ఇతర అధికారులు కరోనా భారిన పడ్డట్టు తెలుస్తోంది.