పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: మోడీ సభ... మమత నిరసన 

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు: మోడీ సభ... మమత నిరసన 

పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు ప్రచారం ఊపందుకుంది.  ఈనెల 27 నుంచి ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి.  ఈరోజు ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్ వెళ్తున్నారు.  కోల్ కతాలోని బ్రిగేడ్ గ్రౌండ్ లో ప్రధాని మోడీ సభను ఏర్పాటు చేస్తున్నారు.  ఈ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ జరుగుతున్నది.  ఇక ఇదిలా ఉంటె, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ బీజేపీకి వ్యతిరేకంగా, పెట్రోల్, డీజీల్ ధరలను నిరసిస్తూ కోల్ కతాలో 4.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయబోతున్నారు.  ఈ యాత్రలో కేవలం మహిళలు మాత్రమే పాల్గొనే అవకాశం ఉన్నది.  రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అనే విధంగా పోటీకి దిగబోతున్నాయి.