వాతావరణ సూచన : రాగాల నాలుగు రోజుల్లో మరో అల్పపీడనం...

వాతావరణ సూచన : రాగాల నాలుగు రోజుల్లో మరో అల్పపీడనం...

తాజా వాతావరణ సూచన ప్రకారం రాగల 2 నుండి 3 రోజులలో తెలంగాణ నుండి నైఋతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. నైఋతి బంగాళాఖాతం ప్రాంతంలో 3.1 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతాలలో సుమారుగా అక్టోబర్ 29 తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. కానీ రాగల మూడు రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది అని అధికారులు తెలిపారు.