మీడియాలో మా తొలుబోమ్మలు ఉన్నాయి

మీడియాలో మా తొలుబోమ్మలు ఉన్నాయి

రాజ్యసభ సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియా మాకు వ్యతిరేకంగా లేదని ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మాకు కూడా మీడియాలో మా తోలు బొమ్మలు ఉన్నాయని అన్నారు. మా సూచనల ప్రకారమే వార్తలను నడుపుతున్న రెండు చానెల్స్ ఉన్నాయని తెలిపారు. అందువల్ల మీడియా మాకు వ్యతిరేకంగా ఉందని చెప్పలేమని అన్నారు. 

తన వ్యాఖ్యలతో సుబ్రహ్మణ్య స్వామి తరచు వివాదాల్లో ఉంటారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే తొలుత ఆదాయపన్నును తొలగించాలని సూచించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ రంగంలో ఉన్న వారు ఎలాగూ పన్ను చెల్లించరని, ధనవంతుల వద్ద చార్టర్డ్ అకౌంటెంట్లు ఉంటారు కాబట్టి వారు చెల్లించేది కూడా బహు స్వల్పమేనని పేర్కొన్నారు.