వైరల్: కోడిపిల్ల కోసం వచ్చి డ్రమ్ములో చిక్కుకున్న అనకొండ...అసలు విషయం తెలిస్తే షాక్ 

వైరల్: కోడిపిల్ల కోసం వచ్చి డ్రమ్ములో చిక్కుకున్న అనకొండ...అసలు విషయం తెలిస్తే షాక్ 

చేపల కోసం ఎర వేసినట్టుగా ఓ వ్యక్తి తన పొలంలో కొండచిలువను పట్టుకోవడానికి   కోడిపిల్లను ఎరవేశాడు.  ఓ డబ్బా లోపల కోడిపిల్లను ఉంచి దానికి తాడుతో ఉచ్చును ఏర్పాటు చెసాడు.  అనకొండ కోడిపిల్లను తినేందుకు డబ్బాలోకి తలను దూర్చింది.  ఉచ్చులో చిక్కుకుంది.  ఆ ఉచ్చు నుంచి బయటకు రాలేక తంటాలు పడింది.  దీనికి సంబంధించిన చిన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.  24 గంటల వ్యవధిలో 1.2 మిలియన్  వ్యూస్ సాధించింది.  అయితే, ఇది రియల్ వీడియో కాదని, మ్యానిప్యులేషన్ వీడియో అని ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది.