అయోధ్య రామాలయం నిర్మాణానికి వ్యాస్ పీఠ్ భారీ విరాళం... 

అయోధ్య రామాలయం నిర్మాణానికి వ్యాస్ పీఠ్ భారీ విరాళం... 

అయోధ్యలో రామాలయం నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ ఆగష్టు 5 వ తేదీన జరగబోతున్న సంగతి తెలిసిందే.  ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ నిర్మాణం జరగబోతున్నది.  భూమి పూజలో ఐదు వెండి ఇటుకలు అమర్చబోతున్నారు.  దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి మట్టి, నీరు తీసుకొస్తున్నారు.  

ఇక ఇదిలా ఉంటె, అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం ఎందరో విరాళాలు ఇస్తున్నారు.  రూపాయి మొదలు ఎంత ఇచ్చిన అది విరాళం కిందకే వస్తుంది.  తాజాగా అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం వ్యాస్ పీఠ్ ఆధ్యాత్మిక గురువు మొరారీ బాపు రూ.5 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు.  త్వరలోనే ఈ విరాళాన్ని అందజేయనున్నారు.