రేపే వరుణ్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

 రేపే వరుణ్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సర్ గా పవర్ ఫుల్ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా అప్డేట్ ను ఇచ్చింది చిత్రబృందం. వరుణ్ తేజ్ కెరీర్ లో 10వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను రేపు ఉదయం 10:10కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయబోతున్నట్లుగా తెలిపింది. కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై అల్లు వెంకటేశ్, సిద్దు నిర్మిస్తున్న ఈసినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నారు. ఇందుకోసం వరుణ్ బాడీ బిల్డ్ చేయడమే కాకుండా కొత్త లుక్ ట్రయ్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ గతంలో బాలు సినిమాలో చేసిన హీరో క్యారెక్టర్ పేరు 'గని'ని ఖరారు చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది.