కొత్త ఆఫర్‌: రూ.48కి 3జీబీ, రూ.98కి 12 జీబీ, రూ.251కి 50 జీబీ డేటా

కొత్త ఆఫర్‌: రూ.48కి 3జీబీ, రూ.98కి 12 జీబీ, రూ.251కి 50 జీబీ డేటా

కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్‌ కారణంగా డేటా డిమాండ్ పెరిగిపోవడంతో... టెలికం కంపెనీలు అన్నీ క్రమంగా ప్లాన్ల మార్పుపై దృష్టి సారించాయి... ఇప్పటికే రియలన్స్ జియో, ఎయిర్‌టెల్ లాంటి సంస్థలో ఇందులో ముందు వరుసలో ఉండగా.. తాజాగా వొడాఫోన్ ఐడియా కూడా కొన్ని కొత్త ఆఫర్లను తీసుకొచ్చింది.. రూ. 251తో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది వొడాఫోన్.. ఈ ప్లాన్‌లో 50 జీబీ డేటా పొందవచ్చు.. అయితే, కాలింగ్, మెసేజ్‌లు, టాక్‌టైం వంటి ప్రయోజనాలు మాత్రం ఉండవు.. 28 రోజుల పాటు 50 జీబీ డేటాను వాడుకునే వెసులుబాటు ఉంటుంది.. ఇక, రూ. 48 ప్లాన్‌లో 3జీబీ డేటాను తీసుకొచ్చిన వొడాఫోన్, దీనికి 28 రోజుల వ్యాలిడిటీ పెట్టింది.. రూ. 98 ప్లాన్‌లో 12 జీబీ డేటాను 28 రోజుల కాలపరిమితితో వాడుకోవచ్చు.. ఇక, రూ. 16 ప్లాన్‌లో 1జీబీ డేటాను 24 గంటల్లో వాడుకోవాల్సి ఉంటుంది. అయితే, వొడాఫోన్ ఐడియా తెచ్చిన తాజా రూ.251 ఆఫర్ ప్యాక్.. కొన్ని సర్కిళ్లకు మాత్రమే పరిమితం చేసింది. ముందుగా... గుజరాత్, బిహర్, చెన్నై, హర్యానా, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ ఈస్ట్, కేరళలో మాత్రంమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.