విశాఖ మత్స్యకారుని వలలో అరుదైన చేప...ఎగబడిన జనం
విశాఖ జిల్లాలోని ఓ మత్స్యకారుని వలలో అరుదైన చేప చిక్కింది. వివిధ రంగుల్లో ఉండే అరుదైన చేప దొరకడంతో దానిని చూసేందుకు చుట్టుపక్కల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. సముద్రతీరంలో రాళ్ళల్లో ఈ చేపలు సంచరిస్తుంటాయని. అరుదుగా మాత్రమే ఇలాంటి చేపలు దొరుకుతాయని మత్స్యకారులు చెప్తున్నారు. రంగురంగులుగా ఉండే ఈ చేపను స్థానికంగా సానిపాప గా పిలుస్తారట. రెండు కేజీల బరువున్న ఈ చేప అచ్యుతాపురం మండలంలోని పూడిమడక తీరంలో మత్స్యకారులకు చిక్కింది. అందంగా ఉండటంతో పాటుగా ఈ చేపలు రుచిగా కూడా ఉంటాయని, మాములు చేపల కంటే ధర అధికంగా పలుకుతుందని స్థానిక మత్స్యకారులు చెప్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)