బ్రేకింగ్‌: ఐపీఎల్ 2020... ఆ ఒప్పందం ర‌ద్దు..

బ్రేకింగ్‌: ఐపీఎల్ 2020... ఆ ఒప్పందం ర‌ద్దు..

భార‌త్-చైనా ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో.. చైనా కంపెనీలు త‌యారు చేసిన వ‌స్తువుల బ‌హిష్క‌ర‌ణ కొన‌సాగుతోంది.. మ‌రోవైపు డిజిట‌ల్ ఉద్య‌మానికి తెర‌లేపిన భార‌త్.. ఆ దేశానికి సంబంధించిన సోష‌ల్ మీడియా యాప్‌ల‌ను కూడా పెద్ద సంఖ్య‌లో తొల‌గించింది... ఇదే స‌మ‌యంలో బీసీసీఐ మాత్రం ఐపీఎల్‌లో వివోను కొనసాగించడంపై విమర్శలు చెల‌రేగాయి.. ఈ నేప‌థ్యంలో.. ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్‌షిప్ నుంచి త‌ప్పుకుంది వివో మొబైల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌.... అయితే, ఇది కూడా తాత్కాలికంగా ఉండే అవ‌కాశం ఉంది.. ఎందుకంటే..  బీసీసీఐ వివో మధ్య జరిగిన ఒప్పందం 2020 సంవత్సరానికి గానూ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

భార‌త్‌-చైనా మ‌ధ్య ఉద్రిక్త పరిస్థితుల స‌మ‌యంలో.. ఐపీఎల్ స్పాన్సర్‌గా కొనసాగడం భావ్యం కాదని భావించిన వివో స్వచ్ఛందంగా తప్పుకున్నట్లు ప్ర‌క‌టించింది. కాగా, ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను వివో ఇండియా ఐదేళ్లకు గానూ 2017లో రూ. 2199 కోట్లకు సొంతం చేసుకుంది. ప్రతీ లీగ్‌లో రూ.440 కోట్లు చెల్లించేలా ఒప్పందం కురుదుర్చుకుంది.. ప్ర‌స్తుతం విమ‌ర్శ‌ల ప‌ర్వంతో వివో ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌తో చేసుకున్న ఒప్పందాన్ని బీసీసీఐ ఎట్టకేలకు ఈ సీజన్ వరకూ రద్దు చేసుకుంది.