వివో బ్రాండ్‌ అంబాసిడర్‌గా విరాట్‌ కోహ్లీ...

వివో బ్రాండ్‌ అంబాసిడర్‌గా విరాట్‌ కోహ్లీ...

 ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ వివో తమ కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కోహ్లీని నియమించుకున్నట్లు ప్రకటించింది. మిలీనియల్స్‌, టెక్నాలజీపై ఆసక్తి కనబర్చే వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ పేర్కొంది. వివో తీసుకొచ్చే ఉత్పత్తులను కోహ్లీ విడుదల చేయడంతో పాటు వాటిపై అవగాహన కల్పించనున్నాడు. భారత మార్కెట్లో స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు షియోమీ, శాంసంగ్‌లకు వివో గట్టిపోటీనిస్తోంది. అయితే వివో ప్రస్తుతం ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఇక రేపు ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 లో కోహ్లీ సేన రోహిత్ సేన తో తలపడనున్న విషయం తెలిసిందే.