వివేకానంద రెడ్డి హత్యకేసు: హైకోర్ట్ ఏం చెప్పిందంటే...!!

వివేకానంద రెడ్డి హత్యకేసు: హైకోర్ట్ ఏం చెప్పిందంటే...!!

2019 ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డి తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. వివేకానందరెడ్డి హత్య జరిగి దాదాపుగా సంవత్సరం కావొస్తోంది.  ఇప్పటి వరకు ఆయన్ను హత్య చేసింది ఎవరు అన్నది తెలియలేదు.  ప్రభుత్వం దీనిపై సిట్ ను ఏర్పాటు చేసింది.  అయితే, సిట్ వలన ఉపయోగం లేదని, ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేకపోయారని, సిట్ పై నమ్మకం లేదని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని చెప్పి వైఎస్ వివేకానంద రెడ్డి భార్య, కూతురు, టీడీపీ నేత బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిలు విడివిడిగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.  

ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది.  అయితే, సిట్ విచారణ వేగంగా జరుగుతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదని చెప్పి అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.  సిట్ విచారణ జరుగుతున్న తీరు గురించిన అడ్వకేట్ జనరల్ సీల్డ్ కవర్ ను హైకోర్టుకు సమర్పించారు.  కాగా, కేసు జనరల్ డైరీ, కేసుకు సంబంధించిన ఫైల్స్ ను సోమవారం రోజున కోర్టుకు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.  తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.