విశ్వ ఫెర్నాండో అరుదైన రికార్డు

విశ్వ ఫెర్నాండో అరుదైన రికార్డు

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక పేసర్ విశ్వ ఫెర్నాండో అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా టాస్ నెగ్గి మొదటగా బ్యాటింగ్ దిగిన ఈ మ్యాచ్‌లో.. శ్రీలంక బౌలర్ విశ్వ ఫెర్నాండో వేసిన తొలి బంతికే ఓపెనర్ హషీమ్ ఆమ్లా డకౌట్ అయ్యాడు. దీంతో ఆమ్లా గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఇప్పటి వరకు హషీమ్ ఆమ్లా తన కెరీర్‌లో గోల్డెన్ డకౌట్ కాలేదు. ఇప్పుడు ఫెర్నాండో ఆమ్లాను గోల్డెన్ డకౌట్‌ చేసి అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆమ్లాను తొలి బంతికే ఔట్ చేయడానికి బౌలర్లకు 124 టెస్టులు పట్టింది.