మొదలైన గుత్తా జ్వాల పెళ్లి సంబరాలు

మొదలైన గుత్తా జ్వాల పెళ్లి సంబరాలు

తమిళ నటుడు విష్ణువిశాల్, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల గత ఏడాది సెప్టెంబర్ లో నిశ్చితార్థం చేసుకున్న వీరిద్దరూ ఈ నెల 22న వివాహం చేసుకోబోతున్నారు. కోవిడ్‌ కారణంగా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలోనే వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. దగ్గరి బంధుమిత్రులతో గుత్తా జ్వాల ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలైయ్యాయి. గుత్తా ఫ్రెండ్స్ రాకతో సందడి.. సందడిగా కనిపిస్తోంది. అంతా కలిసి పార్టీ చేసుకున్న అనంతరం గుత్తాతో కేక్ కట్ చేయించారు. 

కాగా.. విష్ణు, జ్వాల ఇద్దరికీ ఇది రెండో వివాహం. 2010లో రజనీ నటరాజన్‌ను పెళ్లి చేసుకున్న విష్ణు విశాల్‌ 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ చేతన్‌ ఆనంద్‌ను 2005లో వివాహం చేసుకున్న జ్వాల 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు.