సీఎం జగన్ సైకిల్ మీద తిరుగుతున్నారా?

సీఎం జగన్ సైకిల్ మీద తిరుగుతున్నారా?

తిరుపతిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ - జనసేన కవాతు చూసి వైసీపీ మంత్రులు చెవాకులు పేలుతున్నారని అన్నారు. మంత్రులు పిరికిపందల్లా కనపడుతున్నారన్న ఆయన కొడాలి నాని, పేర్ని నాని మంత్రులుగా అసలు పనికిరారని అన్నారు. మంత్రులు సీఎం జగన్ ఇంటి పని మనుషుల్లా చేస్తున్నారని అన్నారు. పవన్ కల్యాణ్, సునీల్ దేవధర్ లను ఏకవచనంతో విమర్శిస్తున్నారని అన్నారు. పవన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగే దమ్ముందా? అని ప్రశ్నించిన ఆయన  పవన్ ప్రత్యేక విమానం లో తిరుగుతున్నారు అని విమర్శిస్తున్నారు, సీఎం జగన్ సైకిల్ మీద తిరుగుతున్నారా? అని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము తో సీఎం ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నారని అన్నారు.

ప్రధాని మోదీ, అమిత్ షా లకు ఎర్రచందనం స్మగ్లింగ్ తో సంబంధం ఉందని మాట్లాడారని. విమర్శించే వాళ్ళు కళ్ళు కనపడని, చెవులు వినపడని ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారని అన్నారు. తిరుపతి బీజేపీని ఎదుర్కోవటానికి 10మంది మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు మకాం వేశారని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని అన్నారు. ఓటుకి 2వేల రూపాయలు పంచుతున్నారని, వాళ్ళ బినామీని తీసుకొచ్చి గ్లాస్ గుర్తు తెప్పించుకున్నారని అన్నారు.

రామ తీర్థం, అంతిర్వేది ఘటనల్లో హోం మంత్రి అసమర్ధత ను మీరే చెప్పుకుంటున్నారా ? అని ప్రశ్నించిన ఆయన భాజపా ఆందోళన చేశాకే దేవాలయాల్లో సీసీ కెమెరాలు వచ్చాయన్నారు. బీజేపీ నేతలు విగ్రహాలు కూల్చితే కేసులు పెట్టండి, లేదా హోం మంత్రిని రాజీనామా చేయమనండని అన్నారు. దమ్ముంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేయండన్న ఆయన నవతరం పార్టీ గాజు గ్లాస్ గుర్తు పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి దీని పై ఫిర్యాదు చేస్తామని అన్నారు. వైకాపా మంత్రులు కొంతమంది ఇండిపెండెట్లు, చిన్న పార్టీలతో పోటీ చేయిస్తున్నారని, సాంకేతిక అంశాలను అడ్డుపెట్టుకుని గాజు గ్లాస్ గుర్తు సాధించారని అన్నారు.