విశాఖ వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లా.. కేంద్ర హోంశాఖ

విశాఖ వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లా.. కేంద్ర హోంశాఖ

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాను వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాగా పరిగణిస్తున్నాం అని వెల్లడించింది కేంద్ర హోంశాఖ... భద్రతా పరమైన ఖర్చు (సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్‌పెండిచర్) స్కీమ్ పరిధిలో విశాఖ జిల్లా ఉందని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ పథకం కింద 2019-20లో రూ.37.23 కోట్లు ఇచ్చామని... గత ఐదేళ్లలో రూ. 95.47 కోట్లు ఏపీకి ఇచ్చినట్టు.. రాష్ట్ర ఎంపీలకు ప్రశ్నలకు రాజ్యసభలో లిఖితపూర్వ సమాధానం ఇచ్చింది కేంద్ర హోంశాఖ... నక్సలైట్ల లొంగుబాట్లను ప్రోత్సహించే పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించిన కేంద్రం.. లొంగిపోయనవారు వ్యాపారాలు చేసుకునేందుకు శిక్షణ - ఆ సమయంలో నెలకు రూ. 6,000 స్టైఫండ్ కూడా ఇస్తున్నట్టు పేర్కొంది.