సెహ్వాగ్ పై ఫైర్ అవుతున్న రోహిత్ ఫ్యాన్స్.. ఎందుకంటే..?

సెహ్వాగ్ పై ఫైర్ అవుతున్న రోహిత్ ఫ్యాన్స్.. ఎందుకంటే..?

ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మను 'వాడా పావ్' అని పిలిచినందుకు భారత మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్‌ పై ట్విట్టర్ వేదికగా హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. పంజాబ్ కు వ్యతిరేకంగా ఆడిన మ్యాచ్ లో గాయపడిన రోహిత్ స్థానంలో ముంబై జట్టులోకి వచ్చిన సౌరభ్ తివారీని సెహ్వాగ్ 'సమోసా పావ్' అని పిలిచాడు. అయితే సెహ్వాగ్ రోహిత్, తివారీ ఫిట్నెస్ ను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మాట్లాడాడు అని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ఇంస్టాగ్రామ్ లో సెహ్వాగ్‌ మాట్లాడుతూ... ''జట్టులో వాడా పావ్ గాయపడితే? అతని స్థానంలో సమోసా పావ్ ను తీసుకున్నారు'' అని తెలుపాడు. సెహ్వాగ్ చేసిన వ్యాఖ్య పట్ల ముంబై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ఒక మాజీ ప్రొఫెషనల్ క్రికెటర్ అయిన సెహ్వాగ్ ఇలాంటి పదాలు ఉపయోగించడం ఏంటి విమర్శిస్తున్నారు. ఇక రోహిత్ శర్మ లేకపోవడంతో తర్వాత ముంబై ఆడిన రెండు మ్యాచ్ లకు పోలార్డ్ నాయకత్వం వహించాడు.