మనం తప్పు చేస్తే ఆ ప్రభావం టోర్నీ పైన పడుతుంది : కోహ్లీ 

మనం తప్పు చేస్తే ఆ ప్రభావం టోర్నీ పైన పడుతుంది : కోహ్లీ 

యూఏఈ లో జరగనున్న ఐపీఎల్ 2020 కోసం అన్ని జట్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం ఆటగాళ్లు అందరూ బీసీసీఐ నియమాల ప్రకారం క్వారెంటైన్ లో ఉన్నారు. అందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన జట్టుతో ఆన్ లైన్ వర్చువల్ మీటింగ్ లో ఆటగాళ్లకు కొన్ని సూచనలు చేసాడు. మనం అందరం తప్పకుండ కరోనా నియమాలను పాటించాలి. అలాగే ఎవరు బయో సెక్యూర్ బబుల్ బయటికి వెళ్ళకూడదు. ఏ విషయం లోను తొందరపడకూడదు. ఎందుకంటే మనం ఒక్క తప్పు చేసిన ఆ ప్రభావం మొత్తం టోర్నీ పైన పడుతుంది. మన జట్టులో ఎవరు అటువంటి పనులు చేయరు అనే నిన్ను అనుకుంటున్నాను. నా నమ్మకాన్ని ఎవరు వమ్ము చేయకండి. అయితే ఈ మీటింగ్ ని ఇలా నిర్వహించడం నాకు కొంచెం కష్టాంగానే అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పదు. నేను మన ప్రాక్టీస్ సెషన్ కోసం ఎదురుచూస్తున్నాను అని కోహ్లీ చెప్పాడు. అయితే ప్రస్తుతం క్వారెంటైన్ లో ఉన్న ఆటగాళ్లకు మూడుసార్లు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అందులో నెగెటివ్ వచ్చిన ఆటగాళ్లు మాత్రమే ఐపీఎల్ లో ఆడటానికి అర్హులు.