విరాట్ కోహ్లీ పై బీసీసీఐ లో ఫిర్యాదు... 

విరాట్ కోహ్లీ పై బీసీసీఐ లో ఫిర్యాదు... 

మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్తా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పై బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేసాడు. ఈ ఫిర్యాదులో, కోహ్లీ రెండు పదవులను ఆక్రమించడంతో విభేదాలు ఉన్నాయని ఆరోపించారు. అసలు విషయం ఏమిటంటే... 2017లో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)‌లో తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా విరుద్ధ ప్రయోజనాలు అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇందులోని నిబంధన ఏంటంటే... బీసీసీఐ కాంట్రాక్ట్‌లో ఉన్న ఎవరైనా సరే.. ఆ బోర్డుతో అనుబంధంగా ఉన్న ఏ సంస్థల్లోనూ ఏ విధంగానైనా సరే భాగస్వామిగా ఉండకూడదు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం 'కార్నర్‌స్టోన్ వెంచర్ పార్ట్‌నర్స్ ఎల్‌ఎల్‌పి' డైరెక్టర్‌గా అలాగే 'విరాట్ కోహ్లీ స్పోర్ట్స్' డైరెక్టర్లలో ఒకడిగా ఉన్నాడు. ఇలా విరాట్ కోహ్లీ ఒకేసారి రెండు పోస్టులను ఆక్రమించి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఆమోదించిన బీసీసీఐ రూల్ 38 (4) ను ఉలంగిస్తున్నారు. అందుకని, అతను తన ఒక పదవిని వదులుకోవాలి" అని గుప్తా తన ఫిర్యాదులో తెలిపారు. అయితే భారత క్రికెట్లో గొప్పవాళ్ళు రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ మరియు కపిల్ దేవ్ లపై కూడా ఈ తరహా  ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఈ దిగ్గజ మాజీ ఆటగాళ్ళు ఒక స్థానానికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఇక ఇప్పుడు కోహ్లీ వంతు... మరి ఈ భారత సారథి ఏం చేస్తాడు అనేది చూడాలి.