ధోని వివాదం తర్వాత ఆ కొత్త నియమం రావాలన్న కోహ్లీ...

ధోని వివాదం తర్వాత ఆ కొత్త నియమం రావాలన్న కోహ్లీ...

క్రికెట్ లో వైడ్ బాల్స్‌కు కూడా రివ్యూ తీసుకునే అవకాశం ఇవ్వాలని పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తో జరిపిన చిట్ చాట్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో ఓ వైడ్ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అంపైర్ పాల్ రీఫెల్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేయగా అతను తన నిర్ణయాన్ని మార్చుకున్న విషయం తెలిసిందే. కానీ తర్వాత టీవీ రిప్లేలో ఆ బంతి వైడ్ అని తేలడంతో ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగింది. ధోనీపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇలాంటి సమస్యలు తలెత్తకుండా వైడ్స్ విషయంలో రివ్యూ అవకాశం ఇవ్వాలని విరాట్ సూచించాడు. అలాగే హై ఫుల్‌టాస్ బాల్స్‌కు కూడా ఇది వర్తించేలా చేయాలన్నాడు. ఇక కోహ్లీ ప్రతిపాదనతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఏకీభవించాడు. ఆ మ్యాచ్ లో ధోని వ్యవహరించిన తీరుపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. చెన్నై సారథి అంపైర్‌ను బెదిరించి గెలిచాడని కొందరు.. మిస్టర్‌ కూల్‌ కూల్‌నెస్‌ను కోల్పోయాడని ఇంకొందరు ట్వీట్లు చేస్తున్నారు.