ధావన్ తో భారత్ కు ఓపెనింగ్ చేసింది ఎవరంటే..?

ధావన్ తో భారత్ కు ఓపెనింగ్ చేసింది ఎవరంటే..?

భారత జట్టు ఈ రోజు ఆసీస్ తో మొదటి  వన్డే మ్యాచ్ లో తలపడుతుంది. అయితే భారత ఓపెనర్లు అనగానే ఇప్పుడు అందరికీ శిఖర్ ధావన్, రోహిత్ శర్మ గుర్తుకు వస్తారు. కానీ ఈ ఏడాది ఐపీఎల్ లో గాయం అయిన కారణంగా ఈ పర్యటనలో పరిమిత ఓవర్ల మ్యాచ్ లకు భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఎంపిక కాలేదు. కానీ ధావన్ కాకుండా వన్డే జట్టుకు మరో ముగ్గురు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, శుబ్మన్ గిల్ సెలక్ట్ అయ్యారు. దాంతో ఈ మ్యాచ్ లో ధావన్ తో కలిసి ఎవరు ఓపెనింగ్ చేస్తారు అనే అనుమానం చాలా మందిలో ఉండగా.. కోహ్లీ దీనిపై స్పష్టత ఇచ్చాడు. ఈ మ్యాచ్ ను ధావన్ తో కలిసి మయాంక్ ఆరంభించనున్నాడు అని పేర్కొన్నాడు. మయాంక్ నిజంగా గొప్ప ఆటగాడు. అతను ఈ ఏడాది ఐపీఎల్ లో అద్భుతంగా రాణించాడు అని కోహ్లీ అన్నాడు. అలాగే 5 వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే రాహుల్ ఈ మ్యాచ్ లో కీపర్ బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు తెలిపాడు. మరి ఈ ఓపెనింగ్ జోడి ఎంతమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.