రోహిత్ గాయం పై స్పందించిన విరాట్...  

రోహిత్ గాయం పై స్పందించిన విరాట్...  

ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ రావడం పై చాలా గందరగోళంగా ఉందని, పర్యటనకు ముందు ఇది మంచి విషయం కాదని టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. అయితే రోహిత్ శర్మ గాయం గురించి విరాట్ కోహ్లీ మాట్లాడటం ఇదే మొదటిసారి. రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ టెస్ట్ సిరీస్ కోసం ఆసీస్ లో ఉండాలంటే, ఈ ఇద్దరు ఆటగాళ్ళు ‘మరో 3-4 రోజుల్లో’ ఆస్ట్రేలియాకు రావాల్సి ఉంటది అని ఇంతకముందు భారత కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నారు. అయితే కోహ్లీ మాట్లాడుతూ.. రోహిత్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఎ) లో ఉన్నాడు. అక్కడ అతని ఫిట్నెస్ పైన పని చేస్తున్నాడు. బీసీసీఐ కూడా వారి గాయాలను పర్యవేక్షించి తరువాత ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటాము అని తెలిపింది అని కోహ్లీ అన్నాడు.