కోహ్లీకి 2016 తర్వాత మళ్ళీ ఇప్పుడు అలా అనిపిస్తుందంట...!

కోహ్లీకి 2016 తర్వాత మళ్ళీ ఇప్పుడు అలా అనిపిస్తుందంట...!

ఈ ఏడాది ఐపీఎల్ యూఏఈ లో జరుగుతుంది. అయితే ప్రతి ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు టైటిల్ ఫెవరెట్స్ లో విరాట్ కోహ్లీ న్యాయకత్వం వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఉంటుంది. కానీ టోర్నీ ముగిసే సమయానికి ఆ జట్టు కనీసం ప్లేఆఫ్ కూడా రాదు. ఇక ఇప్పటివరకు ఆ జట్టు మూడుసార్లు ఫైనల్ కు వచ్చి ఓడిపోయింది. చివరిసారిగా 2016 లో ఫైనల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమిపాలైంది. ఆ తర్వాత జరిగిన మూడు సీజన్లలో ఆ జట్టు చివరి స్థానాలకు పరిమితం అయ్యింది. ఎందుకంటే ఆ జట్టుకు ఎప్పుడు బ్యాటింగ్ ఎంత బలంగా ఉంటుందో బౌలింగ్ అంత బలహీనంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం తమ జట్టు అన్ని విధాలుగా బలంగా ఉంది అని కెప్టెన్ కోహ్లీ అంటున్నాడు. 2016 తర్వాత  మళ్ళీ ఇప్పుడు తమ జట్టు అలా ఉన్నట్లు అనిపిస్తుంది అని చెప్పాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో జట్టు ఇప్పుడు బలంగా ఉంది. మరియు ఈ సీజన్ కు మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. అలాగే ఆటగాళ్లు అందరూ చాలా రోజులుగా ఆటకు దూరం కావడంతో ఇప్పుడు అందరూ తమ ప్రదర్శన చూపించడానికి ఉత్సహంగా ఉన్నారు అని అన్నాడు.