కోహ్లీని చాలామంది వెతికేస్తున్నారు...

కోహ్లీని చాలామంది వెతికేస్తున్నారు...

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి ఎవరికి చెప్పాల్సిన పని లేదు. కెప్టెన్ గా కొంచెం విఫలం అవుతున్న కోహ్లీ ఆటగాడిగా మాత్రం టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. సచిన్ 100 శతకాలను బ్రేక్ చేసే దిశగా కోహ్లీ ముందుకు సాగుతున్నాడు. ఇక ఐసీసీ ర్యాంకింగ్స్ లో వన్డేలో మొదటి స్థానం, టెస్టులో 2, టీ 20 లో 10 వ స్థానం లో కొనసాగుతున్నాడు. అయితే ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్ కోహ్లీనే. ఈ విషయాన్ని ఎస్ఈఆర్ రష్ అనే సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు కోహ్లీని అత్యధికంగా నెలకు సగటున 16.2 లక్షల సార్లు ఆన్‌లైన్‌లో ప్రజలు వెతికారు. ఆ తర్వాత రోహిత్ శర్మ 9.7 లక్షలు, ఎంఎస్ ధోని 9.4 లక్షలతో మొదటి మూడు స్థానాల్లో భారత ఆటగాళ్లే ఉన్నారు. ఇక జార్జ్ మేక్ కే 9.1, జోష్ రిచర్డ్స్ 7.1, హార్దిక్ పాండ్యా 6.7, సచిన్ టెండూల్కర్, 5.4, క్రిస్ మాథ్యూస్ 4.1, శ్రేయాస్ అయ్యర్  3.4 లక్షలతో మొదటి 10 స్థానాల్లో ఉన్నారు. అదే సమయంలో భారత క్రికెట్ జట్టు గురించి నెలకు సగటున 2.4 లక్షల సార్లు వెతకడంతో మొదటి స్థానం లో ఉంది. ఆ తర్వాత  వరుసగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, శ్రీలంక, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, మరియు జింబాబ్వే జట్లు ఉన్నాయి.