ప్రాణం పోయిన ఆర్సీబీని వదలను...

ప్రాణం పోయిన ఆర్సీబీని వదలను...

విరాట్ కోహ్లీ ఓ సంచలనం. ప్రత్యర్థి ఎంతటివాడైన లక్ష్యం ఎంత పెద్దదిగా ఉన్న ఒంటి చేతితో పోరాడి జట్టును గెలిపించగల ఆటగాడు. అయితే ఐపీఎల్ ప్రారంభం నుంచి ఒకే జట్టులో కొనసాగుతున్న ఏకైక ఆటగాడు విరాట్ కోహ్లీ. 2008 లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు 18 ఏళ్ళ కోహ్లీని దక్కించుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అప్పటనుండి 12 ఏళ్ళు జట్టుతో ఉన్నాడు. అయితే 2011 లోనే కోహ్లీ ఆర్సీబీకి కెప్టెన్ అయ్యాడు. ఇక 2016 సీజన్ లో అత్యధికంగా 973 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. అలాగే మొత్తం ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ ముందున్నాడు. కానీ ఛాంపియన్ టైటిల్ పోరులో మూడుసార్లు ఫైనల్ కు వచ్చిన కప్ సాధించలేకపోయింది ఆ జట్టు. అయితే ఆర్సీబీ ఇప్పటివరకు టైటిల్ అందుకోకపోయిన ఆ జట్టు యాజమాన్యం కోహ్లీని వదులుకోలేకపోవడమే కాకుండా అతని పై పూర్తి నమ్మకాన్ని ఉంచింది. ఇక ఈ ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ యూఏఈ వేదికగా జరగనుండటంతో కోహ్లీఅక్కడికి చేరుకున్నాడు. ఇక ఇటీవల ఆర్సీబీ పోస్ట్ చేసిన వీడియోలో విరాట్ మాట్లాడుతూ... జట్టుతో నా ప్రయాణం మొదలై 12 ఏళ్ళు పూర్తయింది. ఈ ప్రయాణం లో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. టైటిల్ కోసం మూడుసార్లు దగ్గరకు వచ్చిన దానిని అందుకోలేకపోయా. అయిన ఏ పరిస్థితుల్లోనైనా ఆర్సీబీని మాత్రం వదలను. మా ప్రాంఛైజ్ నా పై ఎల్లప్పుడూ ప్రేమ చూపిస్తుంది. కాబట్టి నేను ఈ జట్టును వదలను అని కోహ్లీ ఎమోషనల్ గా మాట్లాడాడు.