ఎంజాయ్ చేయడానికి రాలేదు అంటూనే అదే చేస్తున్న కోహ్లీ జట్టు...

ఎంజాయ్ చేయడానికి రాలేదు అంటూనే అదే చేస్తున్న కోహ్లీ జట్టు...

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2020 కరోనా కారణంగా అన్ని బయో బబుల్ నియమాలను పాటిస్తూ నిర్వహిస్తున్నారు. అక్కడికి వెళ్లిన అన్ని జట్లు, సహాయక సిబ్బంది, వారి బస్ డ్రైవర్లు అందరూ ఈ బబుల్ లోనే ఉండాలి. గ్రౌండ్ కి వెళ్ళామా, ప్రాక్టీస్ చేశామా, హోటల్ కు వచ్చామా ఇదే ఇప్పుడు ఐపీఎల్ ఆటగాళ్లు రోజు చేస్తుంది. అయితే ఇలానే చేస్తే ఆటగాళ్లు శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఒత్తిడికి గురవుతారు. అందుకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టు యాజమాన్యం తమ ఆటగాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆటగాళ్లు ఎంజాయ్ చేయడానికి తగ్గిన సౌకర్యాలు కల్పించింది. వారికోసం ఓ ప్రత్యేక గదిని రూపొందించి.. అందులో ఇండోర్‌ గేమ్స్‌ను అలాగే మ్యూజిక్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంతో ఖాళీ సమయాల్లో కోహ్లీసేన అక్కడికి వెళ్లి ఎంజాయ్‌ చేయొచ్చు. దానికి సంబంధించిన వీడియోను ఆర్సీబీ యూట్యూబ్‌లో విడుదల చేసింది. అయితే అంతకముందు ఒకసారి కోహ్లీ మాట్లాడుతూ.. మేము దుబాయ్‌కి వచ్చింది ఎంజాయ్ చేయడానికి  కాదు క్రికెట్ ఆడటానికి, ఆ విషయాన్ని ఆటగాళ్ళు అందరు గుర్తుంచుకోవాలని తెలిపాడు. అయితే ఇప్పుడు వారు ఖాళీ సమయాల్లో అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కారణంగా ఐపీఎల్ లో ఎటువంటిసమస్య తలెత్తిన అది వారి పైనే పడుతుంది.