మేము ఎంజాయ్ చేయడానికి రాలేదు...

మేము ఎంజాయ్ చేయడానికి రాలేదు...

దుబాయ్ వేదికగా జరగనున్న ఐపీఎల్ 2020 కోసం అన్ని జట్లతో పాటుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అతని జట్టుతో కలిసి అక్కడికి వెళ్ళాడు. ఇక అక్కడ తమ ఆరు రోజుల క్వారంటైన్ ను ముగించుకుని ఆర్సీబీ జట్టు శిక్షణను ప్రారంభించింది. అయితే కోహ్లీ తమ జట్టు యూట్యూబ్ ఛానెల్ కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.. కోహ్లీ మాట్లాడుతూ.. మేము దుబాయ్‌కి వచ్చింది ఎంజాయ్ చేయడానికి  కాదు క్రికెట్ ఆడటానికి, ఆ విషయాన్ని ఆటగాళ్ళు అందరు గుర్తుంచుకోవాలని తెలిపాడు. కొన్ని రోజుల క్రితం వరకు అసలు మనం ఐపీఎల్ జరగదు అనుకున్నాము. కానీ ఇప్పుడు అది జరుగుతుంది. కాబట్టి ఐపీఎల్‌ 2020 విజయవంతం అవ్వడంలో అందరూ సహకరించాలని కోరారు. అలాగే బయో బబుల్ నియమాలను అందరూ పాటించాలని అన్నారు. చాలా కాలంగా విరామం లేకుండా మ్యాచ్ లు ఆడుతున్న తనకు ఈ కరోనా ఇచ్చిన విరామం కారణంగా ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపాడు. మొదట నేను ఆటకు చాలా దూరం అయ్యాను అనుకున్నాను. కానీ బ్యాట్ పట్టిన తర్వాత ఆ ఫిలింగ్ లేదు అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.