కోవిడ్ హీరోస్ కు వినూత్నంగా ధన్యవాదాలు తెలుపుతున్న ఆర్సీబీ...

కోవిడ్ హీరోస్ కు వినూత్నంగా ధన్యవాదాలు తెలుపుతున్న ఆర్సీబీ...

ప్రస్తుతం మన దేశాన్ని కరోనా వణికిస్తోంది. ఇప్పటివరకు మన దేశంలో 50 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే మార్చిలో కరోనా లాక్ డౌన్ విధించిన సమయం నుండి ఇప్పటివరకు ప్రజల రక్షణ కోసం కోవిడ్ హీరోస్ గా పేరుపొందిన పోలీసులు, వైద్యులు, పారిశ్యుద్ధ కార్మికులు పనిచేస్తూనే ఉన్నారు. వీరికి ప్రజలు అందరూ తమ తమ విధానాలలో ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ వైరస్ కారణంగా మార్చిలో ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ ఈ నెల 19 న ప్రారంభం కాబోతుంది. మన దేశంలో ఇప్పటికి కరోనా ప్రభావం తగ్గకపోవడంతో యూఏఈ వేదికగా ఈ లీగ్ ను నిర్వహిస్తుంది బీసీసీఐ. అక్కడ కూడా ఈ లీగ్ సాఫీగా సాగడానికి చాల మంది పనిచేస్తున్నారు. అందువల్ల వీరందరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వినూత్నంగా ధన్యవాదాలు తెలుపుతుంది. ఐపీఎల్ 2020 లో ఆర్సీబీ మొదటి మ్యాచ్ ఈ నెల 21న సన్ రైజర్స్ తో ఆడనుంది. ఆ మ్యాచ్ లో ఆర్సీబీ ఆటగాళ్లు ''మై కోవిడ్ హీరోస్" అని ఉన్న జెర్సీలను ధరించనున్నారు. మ్యాచ్ అనంతరం ఆ జెర్సీలను వేలంలో విక్రయించి వచ్చిన మొత్తాన్ని ''గివ్ ఇండియా ఫౌండేషన్'' కు అందించనున్నట్లు పేర్కొంది. ఇక ఈ రోజు ఆ కొత్త జెర్సీలను కోహ్లీ చేతులమీదుగా ఆవిష్కరించిన ఆ జట్టు కొంతమంది కోవిడ్ హీరోస్ ను సత్కరించింది.