ఆటగాళ్ళు ఇప్పుడే గాడిలో పడుతున్నారు : కోహ్లీ 

ఆటగాళ్ళు ఇప్పుడే గాడిలో పడుతున్నారు : కోహ్లీ 

ఐపీఎల్ 2020కి ఇంకా 7 రోజులు మాత్రమే ఉండటంతో ఆటగాళ్లు అందరూ తమ ప్రాక్టీస్ ను తీవ్రతరం చేసారు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ తనకు ఇప్పుడు కొంత ఆనందంగా ఉంది అని తెలిపాడు. ఆర్సీబీ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కోహ్లీ మాట్లాడుతూ... కరోనా ఇచ్చిన విరామం కారణంగా శిక్షణ లేకపోవడంతో ఆటగాళ్ల శరీరాలు అన్ని దానికి అలవాటు పడ్డాయి. దాంతో మళ్ళీ ఇప్పుడు శిక్షణ ప్రారంభించిన తర్వాత అందరూ కొంత ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడిప్పుడే వారందరు గాడిలో పడుతున్నారు. దాంతో నాకు ఆనందంగా ఉంది. అయితే మేము ఏ ఆటగాడిని ఇబ్బంది పెట్టడం లేదు. అలాగే ఒక్కసారిగా భారీ వ్యాయామాలు కూడా చేయడం లేదు. అలా చేస్తే ఆటగాళ్ల శరీరాలు సహకరించగా ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఇక ఇప్పటివరకు మా శిక్షణ బాగానే సాగింది. కానీ మేము చూసుకోవాల్సిన విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అవి ఒకే అయితే నేరుగా బరిలోకి దిగడమే అని కోహ్లీ అన్నాడు. అయితే ఈ ఐపీఎల్ 13వ సీజన్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానున్న ఆర్సీబీ మొదటి మ్యాచ్ 21న సన్ రైజర్స్ తో ఆడనుంది.