తన కెప్టెన్ వీడ్కోలు పై వీడియో విడుదల చేసిన విరాట్...

తన కెప్టెన్ వీడ్కోలు పై వీడియో విడుదల చేసిన విరాట్...

ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టులోకి 2008 లో ఎంట్రీ ఇచ్చాడు. అప్పటినుండి అతను కెప్టెన్ అయ్యేవరకు కూడా మహేంద్రసింగ్ ధోనినే తన కెప్టెన్. ఇక నిన్న ధోని  సోషల్ మీడియా వేదికగా తాను అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ విషయం పై స్పందిస్తూ విరాట్ ఓ వీడియో విడుదల చేసాడు. దానిని బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో విరాట్ మాట్లాడుతూ... ''కొన్ని సమయాలలో మాట్లాడటానికి మాటలు ఉన్నడవు. ఇప్పుడు నాది అదే పరిస్థితి. మనం ఆటను మాత్రమే కాదు మంచి స్నేహని కూడా పంచుకున్నాము. ఒకరిని మరొకరం బాగా అర్ధం చేసుకున్నాము. ఎందుకంటే.. అంతర్జాతీయ క్రికెట్ లో మన దారులు ఒకటే. నేను నీ కెప్టెన్సీ లోనే జట్టులోకి వచ్చాను. నాకు నీతో ఆడటం అంటే చాలా ఇష్టం. నేను మొదటిసారి జట్టులోకి వచ్చినప్పుడు నా పై నమ్మకాన్ని ఉంచింది నువ్వే. నన్ను నమ్మి ఇలా మార్చినందుకు నేను ఎప్పుడు నీకు రుణపడి ఉంటాను. ఇక నేను ఎప్పుడు ఓ విషయానికి అందరికి చెప్తూ ఉంటాను ఇప్పుడు కూడా చెప్తున్నాను. అదేంటంటే... అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వే నా కెప్టెన్‌'' అంటూ ఎమోషనల్ గా చెప్పాడు విరాట్. ఇక భారత్ ఓడిపోయే చాలా మ్యాచ్ లని వీరిద్దరూ కలిసి గెలిపించిన విషయం అందరికి తెలిసిందే. ధోని తన కెప్టెన్సీ భాధ్యతలనుండి తప్పుకున్న తర్వాత కోహ్లీ వాటిని స్వీకరించాడు.