కోహ్లీ మరో వరల్డ్ రికార్డ్.. సచిన్ రికార్డ్ బ్రేక్

కోహ్లీ మరో వరల్డ్ రికార్డ్.. సచిన్ రికార్డ్ బ్రేక్

టీం ఇండియా  రన్‌ మెషిన్‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. దీంతో క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండ్కూల్కర్‌ రికార్డును విరాట్‌ బద్దలు కొట్టాడు. వన్డల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు సాధించిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. కేవలం 251 వన్డేల్లో 242వ ఇన్నింగ్స్‌లో ఈ రికార్డును అందుకున్నాడు. క్యాన్‌బెరాలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్‌ కోహ్లీ.. ఈ ఘనతను సాధించాడు. వన్డేల్లో విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ యావరేజ్‌ 59.41 గా ఉండగా ఇందులో 43 సెంచరీలు ఉన్నాయి. సచిన్‌ 300, పాంటింగ్‌ 314, సంగక్కర 336, జయసూర్య 379వ ఇన్నింగ్స్‌లో 12 వేల పరుగుల మైలు రాయిని దాటారు. కానీ విరాట్‌ కోహ్లీ మాత్రం 242వ ఇన్నింగ్స్‌లో ఈ రికార్డును అందుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 8 వేలు, 9 వేలు, పది వేలు, 11 వేల పరుగులు సాధించిన క్రికెటర్‌గా కూడా కోహ్లీ రికార్డు క్రియేట్‌ చేశాడు.  ఇక వన్డేల్లో 43 సెంచరీలు, 59 హాఫ్‌ సెంచరీలు చేశాడు విరాట్‌ కోహ్లీ.